Russia’s Luna-25 Moon Mission encounters technical problem in pre-landing maneuver: మూన్ రేస్‌లో భారత్ ముందంజలో ఉంది. ఓవైపు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 జాబిల్లిపైపు వడివడిగా అడుగులేస్తుండగా మరోవైపు రష్యా ప్రయోగించిన లూనా-25 మాత్రం దారి తప్పినట్టే కనిపిస్తోంది. సాంకేతిక సమస్యలతో అనుకున్న టైమ్‌కి ల్యాండ్ అయ్యే ఛాన్స్ లేదని సమాచారం. చంద్రుడిపై ల్యాండింగ్‌కి ముందు కక్ష్యలోకి ప్రవేశించాల్సి ఉండగా..అందులో విఫలమైంది లూనా.
అయ్యో పాపం:
దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా ప్రయోగించిన మొదటి లూనార్ ల్యాండర్ ఇది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించాల్సి ఉండగా.. ప్రీ-ల్యాండింగ్ ఫెయిల్ అయ్యింది. రోబోటిక్ వ్యోమనౌక నిన్న(ఆగస్టు 19) కక్ష్యలోకి ప్రవేశించాల్సి ఉంది. ఈ క్రమంలో లూనా-25లో ఎమర్జెన్సీ తలెత్తింది. అందుకే వ్యోమనౌక అనుకున్న విధంగా కక్ష్యలోకి ప్రవేశించలేదని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ఓ ప్రకటనలో తెలిపింది. నాసా, ఇస్రో లాంటి అంతరిక్ష సంస్థలతో రేసులో పాల్గొనేందుకు దూసుకొచ్చిన రష్యా గత వారం క్రాఫ్ట్‌ను ప్రారంభించింది. ఇది ఆగస్టు 21న(రేపు) చంద్రుని దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవుతుందని ముందుగా రాస్‌కాస్మోస్ చెప్పగా అది బెడిసికొట్టింది.
చంద్రునికి అడుగు దూరంలో చంద్రయాన్-3:
మరోవైపు చంద్రయాన్-3 జాబిల్లికి అది దగ్గరలో ఉంది. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రక్రియ పూర్తికావడంతో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ సొంతంగా తిరగడం ప్రారంభించింది. ఇవాళ (ఆగస్టు 20) తెల్లవారుజామున చంద్రయాన్-3 మరో కీలక ఘట్టం పూర్తిచేసింది. తెల్లవారుజాము 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవతంగా కంప్లీట్ చేసింది. సాంకేతిక పరిభాషలో, డీబూస్టింగ్ అంటే అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించే ప్రక్రియ. చంద్రుడికి దగ్గరగా ఉన్న బిందువు (పెరిలున్) 30 కి.మీ వద్ద నుంచి సుదూర బిందువు (అపోలున్) 100 కి.మీ మధ్య ఉంటుందని అర్థం. చంద్రయాన్-3 తన రెండో, చివరి డీబూస్టింగ్‌ను ఈరోజు పూర్తి చేసింది.
చంద్రుడిపై రష్యా కంటే ముందుగా ఇండియా.. లూనాతో బొక్కబోర్లా పడ్డ పుతిన్ కంట్రి!
చంద్రుడిపై ఇండియా కంటే ముందుగా తన ల్యాండర్‌ని ప్రవేశపెట్టాలని చూసిన రష్యా ప్లాన్ బెడిసికొట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఆ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలతో పరిభ్రమిస్తోంది. షెడ్యూల్ ప్రకారం రేపు(ఆగస్టు 21) చంద్రుని దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవుతుందని ముందుగా రాస్‌కాస్మోస్ చెప్పింది. అది సాధ్యం అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మాత్రం అనుకున్న టైమ్‌కే(ఆగస్టు 23) జాబిల్లి ఉపరితలం దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది.
Translate this News: