Chandrababu: దీక్షకు సిద్దమైన చంద్రబాబు.. ఎప్పుడంటే.!
అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు.
అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి జరుగలేదని జగన్‌కు తెలిసి కూడా చంద్రబాబును అరెస్ట్ చేయించారన్న ఆయన.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.
ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లంచ్ మోషన్ పిటిషన్‌ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారు. దీన్ని మధ్యాహ్నం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రిమాండ్‌లో ఉండగా.. తాజాగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపో మాపో అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు వ్యవహారంలోనే వీరిద్ధరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ. బాబుతో ములాకత్ అయ్యేందుకు ముగ్గురూ జైలు లోపలికి వెళ్ళారు. ఈరోజు లోకేష్ కు సీబీఐ నోటీసులు ఇవ్వడానికి బయలుదేరిన విషయఆన్ని వీరు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8.25గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో పాదయాత్ర మరోవారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చేనెల 3వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర చేట్టాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...బ్రాహ్మణి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్ర గురించి బ్రాహ్మణికి కుటుంబ సభ్యులు అన్ని విషయాలను వివరించారట.
ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన ప్రధానమైన అంశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 1931 తర్వాత జరిగిన జనగణనలో కులగణన జరగలేదన్నారు. అనేక మంది విప్లవకారులు సాధించలేనిది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క సంతకంతో సాధించి చూపించారన్నారు.