Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి
రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలవనున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలవనున్నారు.
చంద్రబాబుతో ములాఖత్‌కి వెళ్లి మిలకత్ అయ్యాడు. తాడు బొంగరం లేని వాళ్ళతో మీటింగ్ పెట్టి పిచ్చోడు మాట్లాడాడు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలను అడిగితే జగన్ స్థాయి చెపుతారు. మేధావులు, విద్యార్థులు, గౌరవ ప్రదమైన వాళ్ళు అంతా జగన్ స్థాయి చెపుతారు.
చంద్రబాబు అరెస్ట్‌పై విజయవాడలో మరోసారి టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. నిన్న జగన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడారని బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పెద్ద గజ దొంగ... 42వేల కోట్లు ఈడీ జప్తు చేసిందన్నారు. చార్లెస్ శోభరాజ్ లాగా జగన్‌ను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబును ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన గురించి చర్చించారు.
గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ విషమ పరిస్థితిలోకి నెట్టివేయబడుతుందని ఆయన మండి పడ్డారు.
ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ-జనసేన పొత్తులు కొత్తేంకాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధించిన అనంతరం లూథ్రా న్యాయం జరగనప్పుడు కత్తి పట్టాల్సిందేంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ హింసను ప్రేరేపించేలా ఉందని రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్నారు. అమిత్ షా తో పాటూ కేంద్రమంత్రులను కలిసి తన తండ్రి అరెస్ట్ గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ ను కూడా కోరినట్లు సమాచారం.