ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: రాఖీ పౌర్ణమి వేడుకల్లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు తెలుగు దేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశక్తి - రక్షా బంధన్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు పీతల సుజాత, వంగలపూడి అనిత, తెలుగు మహిళలు, బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. అనంతరం మహిళలకు టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల గురించి చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్కలకు, చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. మహిళలకు మూడు గ్యాస్ సిలెండర్లు కాకుండా అవసరమైతే మరో సిలెండర్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళలను శక్తి మంతులుగా చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని సంకల్పం చేసుకుని ప్రయత్నించండని పిలుపునిచ్చారు. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారు.... బొండా ఉమా ఫైర్...! రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. ఇసుకలో వైసీపీ నేతలు రూ. 40 వేల కోట్లు దోచేశారని ఆయన మండిపడ్డారు. మద్యం పేరిట రూ. 50 వేల కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు ఏపీలో వేడెక్కిన రాజకీయాలు.. ఓట్ల గల్లంతుపై అధికార, విపక్షాల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే ఓట్లు గల్లంతవుతున్నాయా? ఓట్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పని చేస్తుందంటున్న టీడీపీ ఆరోపణల్లో నిజం ఎంత? ఓట్ల గల్లంతు రాజకీయం... ఇప్ప్పుడు ఢిల్లీని తాకింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. By BalaMurali Krishna 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Yuvagalam: యువగళం పాదయాత్రలో హైటెన్షన్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరదం దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. By BalaMurali Krishna 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు kodali nani: యువగళం యాత్రకు స్పందన కరువైంది నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన కరువైందని డిప్రేషన్‌లో ఉన్న లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబం.. ఎందుకంటే..! నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ఏన్టీఆర్ గుర్తుకు చిహ్నంగా ఈ నెల 28న 100 రూపాయల నాణేం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హజరు కావాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Vellampally Srinivas: లోకేష్ యాత్రకు ప్రజా స్పందన లేదు చంద్రబాబు, వపన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ యాత్రకు ప్రజా స్పందన కరువైందని వెల్లంపల్లి ఆరోపించారు. టీడీపీ ఎంపీలు సైతం యువగళం యాత్రను బహిష్కరించారని విమర్శించారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TDP Chief Chandrababu: ఒక్క రోజులోనే నలుగురు అన్నదాతలు సూసైడ్.. చంద్రబాబు ఆవేదన రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొందడంపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొదడం ఆవేదన కలిగించిందన్నారు చంద్రబాబు. By E. Chinni 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావు: చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహా శక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు చంద్రబాబు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn