ఆంధ్రప్రదేశ్ Chandrababu: కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. కొత్తపేటలో బహిరంగ సభ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాల హిట్ పెరుగుతోంది. రోజురోజుకు అధికార పార్టీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కనీస భద్రత లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దాడుల విషయాకి కొస్తే సీనియర్ నేతలకే రక్షణ లేదు.. ఇక ప్రజలను ఏవిధంగా కాపాడుతారు..? అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. By Vijaya Nimma 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Sajjala Ramakrishna Reddy: ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా.? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బాబు ఓ పక్క, దత్తపుత్రుడు, మరోపక్క, తన సుపుత్రుడు ఇంకోపక్క తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు.. మంచి చేస్తున్న జగన్‌ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. By Karthik 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Chandrababu: 'నన్ను ఆయన అర్ధం చేసుకున్నారు'.. గద్దర్ ఇంటికి చంద్రబాబు! పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. గద్దర్ మరణం బాధ కలిగించిందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన సమయంలో సీఎంగా చంద్రబాబే ఉన్నారు. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu and Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, పవన్ రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అలాగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు.జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Ambati rambabu: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. By Karthik 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Minister Dharmana Prasada Rao: 14 ఏళ్లు సీఎం అయి ఉండి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా?: మంత్రి ధర్మాన ఫైర్ మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అంటే మోసాలు, వెన్నుపోట్లు : సీఎం జగన్! కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. By Bhavana 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: కేసుల్లో చిక్కుకున్న బాధితులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు.. విడుదల చేయిస్తానని భరోసా! అన్నమయ్య జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు కేసులు నమోదు చేసిన బాధిత కుటుంబాలతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఫోన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను, పార్టీ పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చు. తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని స్పష్టం చేశారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తానని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే బయటకు తీసుకువస్తామని వెల్లడించారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ నీరు గారుస్తోంది: చంద్రబాబు ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు చంద్రబాబు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn