అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. మార్మోగిపోయిన వాషింగ్టన్ డీసీ
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు అమెరికాలో ఘనంగా మొదలయ్యాయి. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగిపోయాయి. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు సంబరాలు చేసుకున్నారు.