IND vs AFG: బూమ్ బూమ్ బుమ్రా.. భలే వేశాడు భయ్యా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లలో అఫ్ఘాన్ 8 వికెట్లకు 272 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4వికెట్లు తీశాడు. అఫ్ఘాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా రాణించారు. హష్మతుల్లా 88 బాల్స్‌లో 80 రన్స్ చేయగా.. అజ్మతుల్లా 69 బంతుల్లో 62 రన్స్ చేశాడు.