MP Venkat Reddy: బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైంది
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు.
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీకి అసెంబ్లీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తమ పార్టీకి అభ్యర్థులు లేరు అనే వారు గుడ్డి వారన్నారు.
ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా అధికార పార్టీకి అనుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం గమనిస్తుందన్న ఆయన.. పార్టీలో పంచాయతీ పెట్టేవారికి మంత్రి కేటీఆర్ బుద్దిచెప్పారన్నారు. జనగామా నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానేనని ఆయన స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టక ముందే దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే గంపా గోవర్డన్ను సీఎం కోట్ల రూపాయల ప్రజాధనం ఇచ్చారని ఆరోపించారు.
సమగ్ర శిక్షణ అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులని దారుణంగా మోసం చేశారని.. ఆయనకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అడిగితేనే మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. అయితే కలిసి పనిచేస్తామనే ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.