Rathod Bapurao: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న బోథ్ ఎమ్మెల్యే
మరో రెండు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ జెండాను వీడనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు.