వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..!
కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఆరోపణలకు మరింత మసాలా దట్టించి పోస్ట్ చేసింది. రెండు పార్టీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలోనే ఈ రెండు పార్టీలు వివాహం చేసుకోబోతున్నాయంటూ ఓ సెటైరికల్ వెడ్డింగ్ కార్డ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.