Telangana BJP:ప్రచారంలో వేగం పెంచుతున్న బీజేపీ...16న మేనిఫెస్టో విడుదల
ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచింది తెలంగాణ బీజేపీ. అభ్యర్థులను ప్రకటించడం అయిపోవడంతో మేనిఫెస్టో మీద దృష్టిని పెట్టింది. ఈ నెల 16న మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచింది తెలంగాణ బీజేపీ. అభ్యర్థులను ప్రకటించడం అయిపోవడంతో మేనిఫెస్టో మీద దృష్టిని పెట్టింది. ఈ నెల 16న మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
వేములవాడ టికెట్ ను ఇచ్చినట్లు ఇచ్చి ఆఖరి నిమిషంలో మార్చడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తుల ఉమ ఈ రోజు బీజేపీకి రాజీనామా చేశారు. బీసీ బిడ్డనైన తనకు అన్యాయం చేసినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు ఉమ.
ఏపీలో మద్యం గురించి గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందజేయాలని తెలిపారు.
ఈరోజు నారాయణ పేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొంటుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోన్న జనసేనకు షాక్ తగిలింది. పొత్తులో భాగంగా ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించన పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదం బూటకమని తుల ఉమ ఫైర్ అయ్యారు. తనతో మాట్లాడడానికి బీజేపీ నేతలు వస్తే చెప్పుతో కొడతానని ధ్వజమెత్తారు. ఒకటి, రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్న బీజేపీలో ఇక ఉండేలనంటూ తుల ఉమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేటీఆర్ ఆమెకు ఫోన్ చేయగా.. ఏఐసీసీ నేత ఒకరు ఉమ నివాసానికి కాసేపట్లో వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీ మార్పు కన్ఫామ్ అని తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా పరిణమించారు. టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. దాంతో వీరిని బుజ్జగించేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు.