Telangana Elections: అందుకే కాంగ్రెస్లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ప్రజాభిష్టం మేరకే బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్లో చేరబోతున్నట్టు రాజగోపాల్రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే ఉందని ప్రజలు అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు.కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.