TS Elections 2023: బీజేపీలో 70 శాతం కొత్త ముఖాలే.. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నది కేవలం 10 మందేనట!

ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో 70 మంది అభ్యర్థులు 2018 తర్వాతనే పార్టీలోకి వచ్చిన వారు ఉన్నారు. కేవలం పది మంది మాత్రమే బీజేపీతోనే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారు ఉండడం గమనార్హం.

New Update
Lok Sabha Elections 2024: తొలి జాబితా ప్రకటన.. తెలంగాణలో బీజేపీకి షాక్ తప్పదా?

తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో (TS Elections 2023) సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ (BJP) అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని అమిత్ షా స్వయంగా ప్రకటించారు. మరో వైపు ఇటీవల ప్రధాని మోదీ (PM Modi) ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్ మాదిగ విశ్వరూప సభలో కీలక ప్రకటన చేశారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణపై ప్రధాని ప్రకటనతో పాటు, తాము ఇవ్వబోయే హామీలు, మోదీ ఇమేజ్ తో ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. బీజేపీకి అంత సీన్ లేదని, ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుందని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ సీట్ల కేటాయింపు లెక్కలను ఓ సారి పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ప్రకటించిన 111 సీట్లలో 70కి పైగా అభ్యర్థులు 2018 ఎన్నికల తర్వాతే బీజేపీలో చేరిన వారే ఉన్నారు. ఇంకా.. ఐదు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు బీజేపీలో ఉన్న వారి సంఖ్య 37. ప్రస్తుతం పోటీలో ఉన్న వారిలో బీజేపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించిన వారు 10 మంది కూడా లేదని లెక్కలను పరిశీలిస్తే అర్థం అవుతోంది.
ఇది కూడా చదవండి: KTR: కాంగ్రెస్ కు కర్ణాటక నుంచి పైసలు.. నకిరేకల్ లో కేటీఆర్ సంచలన ఆరోపణలు!

బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అదే పార్టీ తరఫున బరిలోకి దిగిన 26 మంది వీరే..

మంచిర్యాల-రఘునాథ్ రావు

ఆసిఫాబాద్-ఆత్మారావు నాయక్

ఆదిలాబాద్-పాయల్ శంకర్

జుక్కల్-అరుణతార

కామారెడ్డి-కాటిపల్లి వెంకటరమణారెడ్డి

బాన్సువాడ-ఎండల లక్ష్మీనారాయణ

కరీంనగర్-బండి సంజయ్

చొప్పదండి-బొడిగ శోభ

ఆందోల్-బాబు మోహన్

దుబ్బాక-రఘునందన్ రావు

మల్కాజ్ గిరి-రామచందర్రావు

ఉప్పల్- ప్రభాకర్

మహేశ్వరం-అందెల శ్రీరాములు యాదవ్

ఖైరతాబాద్-చింతల రామచంద్రారెడ్డి

కార్వాన్-అమర్ సింగ్

గోషామహల్-రాజాసింగ్

సికింద్రాబాద్-కంటోన్మెంట్ శ్రీ గణేష్

నారాయణ పెట్-రతంగ్ పాండురంగారెడ్డి

కల్వకుర్తి-ఆచారి

కొల్లాపూర్-సుధాకర్ రావు

నాగార్జునసాగర్-నివేదిత రెడ్డి

సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వరరావు

తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య

మహబూబాబాద్-జాటోత్ హుస్సేన్ నాయక్

భూపాలపల్లి-చందుపట్ల కీర్తి రెడ్డి

సత్తుపల్లి-రామలింగేశ్వరరావు

ఈ మధ్యనే బీజేపీలో చేరి టికెట్లు పొందినవారు

బెల్లంపల్లి-శ్రీదేవి

నిర్మల్-మహేశ్వర్ రెడ్డి

ఆర్మూర్-రాకేష్ రెడ్డి

బోధన్-మోహన్ రెడ్డి

ఎల్లారెడ్డి-సుభాష్ రెడ్డి(షెడ్యూల్ వచ్చాక)

జగిత్యాల-భోగ శ్రావణి

వేములవాడ-వికాస్

మానకొండూరు-ఆరెపల్లి మోహన్

చేవెళ్ల-కేఎస్ రత్నం

అంబర్పేట్-కృష్ణ యాదవ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్-శ్రీ గణేష్

దేవరకద్ర-ప్రతాపరెడ్డి

మునుగోడు-చలమల కృష్ణారెడ్డి

హుజూర్నగర్-చల్లా శ్రీలత రెడ్డి

డోర్నకల్-సంగీత నాయక్

పరకాల-కాళీ ప్రసాద్

ములుగు-ప్రహ్లాద్

Advertisment
Advertisment
తాజా కథనాలు