Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ మద్దతు
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాజాగా సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆగ్రాకు చేరుకున్న తర్వాత అఖిలేష్ పాల్గొని మద్దతు ప్రకటించారు. యూపీలో ఎస్పీ 63 చోట్ల, కాంగ్రెస్ 17 చోట్ల లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి.