BJP: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, తమ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి తమ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టిన కామారెడ్డి ప్రజలకు అభినందనలు తెలిపారు.