Bihar Train Accident: బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. సమస్తిపూర్ వద్ద సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (Sampark Kranti Express) రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు.. దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా సమస్తిపూర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
बिहार संपर्क क्रांति एक्सप्रेस दो हिस्सों में बंटी
ट्रेन का इंजन एक कोच लेकर चल पड़ा और बाकी कोच कपलिंग टूटने से पीछे रह गए। ये ट्रेन दरभंगा से नई दिल्ली जा रही थी। pic.twitter.com/L2vSor04Cm
— Sachin Gupta (@SachinGuptaUP) July 29, 2024
Also Read: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు?
అయితే బోగీలు విడిపోయిన సమయంలో రైలు తక్కువ వేగంతోనే వెళ్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు దాదాపు గంట పాటు శ్రమించి విడిపోయిన బోగీలను ఇంజిన్‌కు కనెక్ట్ చేసినట్లు తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చంద్ర పేర్కొన్నారు. ఈ ఘటనకు గల కారణాలను నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు.