Ranji : రంజీ ఆటగాళ్లకు బీసీసీఐ కానుక!
రంజీ ఆటగాళ్లకు బీసీసీఐ భారీ కానుక ఇచ్చింది. ప్రతి సీజన్లో నిర్ణీత మ్యాచ్‌లలో 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆడే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
రంజీ ఆటగాళ్లకు బీసీసీఐ భారీ కానుక ఇచ్చింది. ప్రతి సీజన్లో నిర్ణీత మ్యాచ్‌లలో 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆడే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
భారత్‌లో క్రికెట్ అభిమానులకు షాక్ తగలనుంది. ఐపీఎల్ 2024 సెకండ్ పార్ట్ యూఏఈలో జరగనుందని తెలుస్తోంది. అదే టైమ్‌లో ఎన్నికలు జరనుండడంతో...ఐపీఎల్‌ను దుబాయ్‌కు తరలించనున్నారని చెబుతున్నారు.
రిషభ్ పంత్ రీ ఎంట్రీపై బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్- 2024 సీజన్‌కు బ్యాటర్, వికెట్‌కీపర్‌గా పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరనున్నట్లు స్పష్టం చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమిలు ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు తెలిపింది.
దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ బీసీసీఐకి శార్దూల్ రాసిన లేఖపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. శార్దూల్ మాత్రమే కాదు.. జట్టులో చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా మార్పులు, చేర్పులతో షెడ్యూళ్లను రూపొందించాలన్నాడు.
ఇండియన్ క్రికెటర్స్‌లో కచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఇంతకు ముందే ప్రకటించింది. ఇప్పుడు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కూ 45 లక్షలు ఇస్తామంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జైషా కీలక ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
దేశవాళి మ్యాచ్‌లు ఎగ్గొట్టి టైమ్ పాస్ చేసిన శ్రేయస్, ఇషాన్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితా నుంచి వారి పేర్లు తొలగించింది. ఈ ఏడాది 30 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చిన బీసీసీఐ ఈ ఇద్దరినీ జాబితాలో పెట్టలేదు. అటు రింకూ గ్రేడ్-సీలో ప్లేస్ కొట్టేశాడు.
ఇంగ్లాడ్ - భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక బౌలర్ అశ్విన్ మ్యాచ్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సమయంలో అతడికి అండగా ఉంటామని తెలిపింది.
రంజీలు ఆడితేనే ఐపీఎల్లో ఆడాలని పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ ఆడటానికి కనీసం 3-4 రంజీ మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించినట్టుగా సమాచారం. ముఖ్యంగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ చాలా సీరియస్‌గా ఉన్నట్టు అర్థమవుతోంది.
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టైటిల్‌ను ముద్దాడేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.