Telangana: బతుకమ్మ, దసరా సంబరాలు.. నగరంలో ప్రయాణికుల రద్దీ..
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి రద్దీ వాతావరణం నెలకొంది. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో రోజువారీ 3,500 బస్సులకు అదనంగా 1,700 అదనపు బస్సులు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.