Obscene Dances : బంజారాహిల్స్ పబ్ లో అసభ్యనృత్యాలు.. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ లోని ఆఫ్టర్ నైన్ పబ్ లో శనివారం రాత్రి పోలీసులు రెయిడ్ చేశారు.పబ్ లో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.వారిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.