BJP MP Bandi Sanjay Sensational Comments: పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య అని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సోమవారం ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన బండి సంజయ్.. ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తోన్న ఏకైక సర్కార్ జగన్ దే అని ఆరోపించారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ దుయ్యబట్టారు బండి సంజయ్.