Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు..టీటీడీ గుడ్ న్యూస్..ఏంటో తెలుసా?
అయోధ్యాపురిలో కొలువుదీరనున్న రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే మీకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు ఈవో తెలిపారు.