Ayodhya: అయోధ్య లోని విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా!
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ గా నామకరణం చేసినట్లు సమాచారం. శనివారం(డిసెంబర్ 30) నాడు దీనిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ గా నామకరణం చేసినట్లు సమాచారం. శనివారం(డిసెంబర్ 30) నాడు దీనిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
అయోధ్య రామ మందిరం ప్రతిష్టను పురస్కరించుకుని ఆలయానికి 100 కోసి మార్గ్ లో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదన్నారు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు.
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలకు ఆహ్వానం పంపించారు.
గుజరాత్‌కు చెందిన ఓ రామ భక్తుడు అయోధ్య రామయ్యకు వజ్రాల కంఠహారాన్ని తయారు చేయించారు. 5వేల అమెరికన్ వజ్రాలతో దీనిని తయారు చేయించారు. రామాయణంలోని ముఖ్య పాత్రలను కళాకారులు ఈ హారంపై తీర్చిదిద్దారు.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సీనియర్ నేతలు అయినటువంటి ఎల్ కే అద్వానీ, జోషిలను ఆలయ ట్రస్ట్ రావొద్దని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీంతో నేడు విశ్వ హిందూ పరిషత్ వారు వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు.
బీజేపీ కురవృద్ధులైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. పైగా వారిద్దరినీ కార్యక్రమానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ వారికి తెలిపినట్లు సమాచారం.
అయోధ్య భవ్య మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22 న జరగనుంది. ఆ మరుసటి రోజు నుంచి భక్తులకు అనుమతినిచ్చిన క్రమంలో రైల్వేశాఖ తొలి 100 రోజులు కూడా 1000 ప్రత్యేక రైళ్లను అయోధ్యకు నడపనున్నట్లు తెలిపింది.
ఈ నెల 25 న అయోధ్య శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి వీకే సింగ్, సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు మంగళవారం పరిశీలించారు.