ఆస్ట్రియా ప్రధానితో.. మోదీ భేటీ!
వాతావరణ మార్పులు, ఉగ్రవాదం సహా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆస్ట్రియా ప్రధానితో చర్చలు జరిపినట్టు మోదీ తెలిపారు. రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా చేరుకున్న మోదీకి అక్కడి ప్రభుత్వం సైనిక లాంఛనాలతో స్వాగతం పలికింది.అనంతరం ఇరుదేశాల నేతలు భేటీ అయ్యారు.