Lawyer Sidharth Luthra Tweet: చంద్రబాబు లాయర్ ట్వీట్ పై వేసీపీ నేతల ఫైరింగ్
చంద్రబాబు లాయర్ ట్వీట్ పై వేసీపీ నేతల ఫైరింగ్ | YCP Counter on Lawyer Sidharth Luthra Tweet | Ambati Rambabu
చంద్రబాబు లాయర్ ట్వీట్ పై వేసీపీ నేతల ఫైరింగ్ | YCP Counter on Lawyer Sidharth Luthra Tweet | Ambati Rambabu
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.
లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతోపాటు లోకేశ్ పేరును కూడా పేర్కొంది
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుపై తెలంగాణ బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకుడిని ఇలా అరెస్టు చేయడం..వెనక బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండి ఉండాలని అభిప్రాయపడ్డారు.
నారా లోకేష్‌కు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. అవినీతికి పాల్పడ్డ వ్యక్తిని జైలుకు పంపించకుండా సినిమాకు పంపిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకుంటూ చంద్రబాబు అనేక మోసాలకు తెరలేపారని విమర్శించారు.