ఏపీకి అతి భారీ వర్షాలు! Heavy Rains | RTV
ఏపీకి అతి భారీ వర్షాలు! Heavy Rains | RTV| IMD passes alerts with regard to heavy rain fall which is expected in coming two days in the coastal Areas of AP | RTV
ఏపీకి అతి భారీ వర్షాలు! Heavy Rains | RTV| IMD passes alerts with regard to heavy rain fall which is expected in coming two days in the coastal Areas of AP | RTV
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం చోటు చేసుకోనుంది. ఇది క్రమంగా బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని అధికారులు తెలిపారు. అల్పపీడనం నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలు చేశారు. తిరుమలలోని ఘాట్ రోడ్లలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.