BREAKING: వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్!
వైఎస్ భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సీబీఐ కోర్టు. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
వైఎస్ భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సీబీఐ కోర్టు. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
లియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని కళ్యాణ కట్టపై రాజకీయాలు చేయొద్దని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య కోరారు.
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలతో ఏ విధంగా మాట్లాడాలో అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకొండి అంటూ భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌కు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి సీబీఐ,ఈడీ కేసులకు సంబంధించి షరతులు ఉల్లంఘిస్తున్నారని.. ఆయనపై ఉన్న కేసులన్నీ తక్షణమే విచారించాలని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను భయపడేలా చేస్తున్నాయి. SBI బ్యాంక్ చోరి ఘటన మారువకముందే మరో ఘటన జరిగింది. పేరుపాలెం బీచ్ సమీపంలో పాండురంగస్వామి ఆలయంలో హుండిని ధ్వంసం చేసి నగదు అపహరించారు.
దాదాపు 15 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు హారతి పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు ఆయన సతీమణి భువనేశ్వరి. నిన్న సాయంత్రం 4:15గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు చంద్రబాబు. అక్కడ నుంచి నివాసానికి చేరుకునేవరకు దారిపొడువునా కార్యకర్తలు కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మరథం పట్టారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
కడప జిల్లాలో ఓ వ్యక్తిపై వేటకొడవలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. వైసీపీ బస్సు యాత్ర నేపథ్యంలో ప్రొద్దుటూరులో బెనర్జీ అనే యువకుడిపై టీడీపీ ఇంఛార్జి అనుచరుడు భరత్ దాడి చేసి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ చంద్రబాబును ప్రజల మధ్యకు రానివ్వకుండా చేస్తున్నారని టీడీపీ నేత లోకేష్ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని విమర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపెట్టలేకపోయారని.. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలంటూ సవాల్ చేశారు.