ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంతో పాటు వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయనున్నారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bull Race: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు! గంగ జాతర పురస్కరించుకొని తిరుపతి జిల్లా కొట్టాలలో నిర్వహించిన ఎద్దుల పోటీలో అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చిన బాహుబలి ఎద్దు జనంపైకి తిరగబడి దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పొడిచి చంపింది. స్థానిక ఎస్సై రామాంజనేయులు ఎద్దుల పోటీని తాత్కాలికంగా నిలిపేశారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి రామ్‌ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దీనిపై ఈ నెల 12న సీఎం చంద్రబాబు రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasamsetti Subhash: గంజాయి గ్యాంగ్‌ను పట్టిస్తే రూ.5వేల నజరానా.. మంత్రి బంపర్ ఆఫర్! గంజాయి అమ్మే, తాగే గ్యాంగ్ లను పట్టిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.5వేలు ఇస్తానని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అలాగే తనకు గంజాయి బ్యాచ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలను నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ World Tribal Day: ఏపీలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు! ఏపీలోని రాజమహేంద్రవరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఆదివాసులకు మద్దతుగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి కంబాల చెరువు వరకు ర్యాలీ చేపట్టారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ AP: బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కర్ణాటక అటవీశాఖ మంత్రితో సమావేశం కానున్నారు. కుంకీ ఏనుగులు, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: వైసీపీ నాకు శత్రువు కాదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు! విశాఖపట్నం జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీపై తనకు ఎలాంటి కక్ష లేదని, తనకు ఎవరూ శత్రువు కాదన్నారు. అందరూ కలిసిగట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి 5 మంది కార్పొరేటర్లు..! విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఐదు మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్..! పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అసెంబ్లీకి రాని జగన్‌కు రాష్ట్రంలో ఏం పని అని నిలదీశారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి అంతు చిక్కడం లేదని .. నెల రోజుల్లో జగన్ అవినీతి బట్టబయలు చేసి పని పడతామన్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn