AP News: రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో జనం పరుగు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాడికి కోల్డ్ స్టోరేజ్ గోదాం తగలబడింది. మంటలు వ్యాపించడంతో ప్రాణభయంతో వ్యాపారస్తులు, స్థానికులు పరుగు తీశారు.

New Update
 fire accident rajamandri

Fire Accident Rajahmundry

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజా నగరం నియోజకవర్గం రాజమండ్రి దివాన్ చెరువు హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాడికి కోల్డ్ స్టోరేజ్ గోదాం తగలబడింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంతో భయభ్రాంతులకు గురైన కార్మికులు, వ్యాపారులు, రైతులు బయటకు పరుగులు తీశారు. అనంతరం పండ్ల మార్కెట్‌లో ప్రమాదంపై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.  ఫైర్‌ ఇంజన్‌తో మంటలను అదుపు చేస్తున్నారు.  ప్రమాదంలో వేగంగా మంటలు వ్యాప్తి చెందడంతో కోల్డ్ స్టోరేజ్ అంతా మంటల్లో చిక్కుకోని పోయింది. కోల్డ్ స్టోరేజ్ కావడంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతం అంతా పొగతో కమ్ముకొని పోయింది. దీంతో అందరు ఇబ్బందికి గురైయ్యారు.

 

పక్కనే ఉన్న పండ్ల షాపులకు మంటలు అంటుకోకుండా ఉండడానికి సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కావడంతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంది. అందుకని ఎలాక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వాడేవారు వాటిని కూలింగ్ చేసేవాల చర్యలు తీసుకొవాలని అధికారులు చెబుతున్నారు.  లేందంటే అవి హీటెక్కి.. ఇలాంటి అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని  చెప్పుకొస్తున్నారు. ప్రతి వేసవిలో ఇలాంటి అగ్నిప్రమాదాలు జురుగుతూనే ఉంటాయి. కావునా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు