AP Minister Ambati Rambabu: లోకేష్ రాజకీయ బఫూన్.. నాగురించి మాట్లాడే స్థాయి లేదు: మంత్రి అంబటి
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పైశాచికాచినందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. నా గురించి విమర్శలు చేసే స్థాయి లోకేష్ కు లేదన్నారు మంత్రి అంబటి. లోకేష్ రాజకీయ బఫూన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులు అనమంటే బీసీ చౌదరిలు అంటున్నాడని.. వైశ్యులను వైశాలి అంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ దిగజారుడు విమర్శలు చేస్తున్నాడని తీవ్రంగా మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నేను పండుగ సమయంలో డాన్స్ చేశా అయితే ఇప్పుడు ఏంటి? నేను మాట్లాడటం మొదలు పెడితే మీరంతా ఏడుస్తారు అంటూ ధ్వజమెత్తారు.