Amarnath : అసూయ, ద్వేషాలతోనే పవన్ మాట్లాడుతున్నారు: మంత్రి అమర్నాథ్!
పవన్ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీని పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.విశాఖ వేదికగా పవన్ అసూయతో అసత్యాలు మాట్లాడారు. పవన్ అనే అమాయకుడిని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాహి అనే లారీ మీద ఎక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నాడు అంటే అతనికి ఎంతటి అసూయ ఉంతో తెలుస్తుందన్నారు.