Eluru: కడుపులో కత్తెర మరచిన వైద్యులు..ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం!

ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.గర్భిణీకి సిజేరియన్‌ చేసిన వైద్యులు..ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఓ మహిళ వారం క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది.

New Update
Eluru: కడుపులో కత్తెర మరచిన వైద్యులు..ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం!

Eluru: వైద్యులు రోగుల కడుపులో దూది, కత్తెరలు మరిచిపోయిన సంఘటనలు అనేకం వెలుగు చూసిన ఘటనలు మనం గతంలో చూశాం. తాజాగా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో (Eluru Govt Hospital) ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

గర్భిణీకి సిజేరియన్‌ చేసిన వైద్యులు..ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఓ మహిళ వారం క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్‌ వైద్యురాలు ఆమెకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేశారు.

అయితే కుట్లు వేసే క్రమంలో ఆమె కడుపులో కత్తెరను తీయడం మరిచిపోయారు. ఆ తరువాత ఆమె ఇంటికి కూడా వెళ్లిపోయింది. అయితే ఆమెకు ఇంటికి వెళ్లినప్పటి నుంచి కూడా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. మరోసారి ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు.

ఈ క్రమంలో ఆమెకు తీసిన ఎక్స్ రే ను ఓ ఉద్యోగి తన ఫేస్‌ బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించాడు.

అక్కడితో ఆగకుండా ఆసుపత్రి సిబ్బంది ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి కేసు షీట్‌, అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ వంటి సమాచారాన్ని కూడా మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రి ఆవరణలోని ఎక్స్‌రే విభాగంలో తీసిన రికార్డులపై మాత్రం బాధితురాలి పేరు, తేదీతో సహా పలు వివరాలు ఉన్నాయి.

ఎక్స్‌రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ మేటర్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాత్రం తాను సెలవులో ఉన్నానని.. కత్తెర మరిచిన ఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Also Read: బాత్‌ రూమ్‌ లో బిడ్డను కని వదిలేసిన యువతి..చిత్తూరులో దారుణ ఘటన

Advertisment
తాజా కథనాలు