Chandrababu: ఇంత నీచమైన దొంగ ఎన్నికల ప్రయత్నాలు చూడలేదు..వైసీపీపై చంద్రబాబు ఫైర్
చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగ ఓట్లకు తెరతీసింది వైసీపీనే అని ఆరోపించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన దొంగ ఎన్నికల ప్రయత్నాలు తానేప్పుడు చూడలేదని పేర్కొన్నారు.