Pithani Balakrishna: ముమ్మిడివరం టికెట్ జనసేనకే.. జగన్ మోసం చేస్తే.. నా దేవుడు పవన్ కళ్యాణ్ హక్కున చేర్చుకున్నారు: పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం టికెట్ జనసేనకే కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఆ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. అన్ని సర్వేలు తానే గెలుస్తాయని సూచిస్తున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.

New Update
Pithani Balakrishna: ముమ్మిడివరం టికెట్ జనసేనకే.. జగన్ మోసం చేస్తే.. నా దేవుడు పవన్ కళ్యాణ్ హక్కున చేర్చుకున్నారు: పితాని బాలకృష్ణ

Pithani Balakrishna: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జనసేన ఇన్చార్జ్ పీఎసీ సభ్యులు పితాని బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన - టీడీపీ పోత్తులో భాగంగా లెక్కతెల్చుకుని ప్రకటన చెయ్యవలసిన సమయం దగ్గర పడుతుందన్నారు. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తే.. మా దేవుడు పవన్ కళ్యాణ్ హక్కున చేర్చుకున్నారని కొనియాడారు. ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ 2019లో శెట్టి బలిజ బీసీ సామాజిక వర్గం అయిన తనకు రాష్ట్రంలో మొట్టమొదటి సీటుగా ప్రకటించారని గుర్తు చేశారు.

Also Read: ఇంతకు ముందు స్మగ్లర్లు అడవిలో ఉండేవారు..కానీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు: మిట్టా వంశీ

మూడు రోజులుగా ఇరుపార్టీల అది నాయకులు చర్చలు జరుపుతున్నారని.. ఈ చర్చలలో ముమ్మిడివరం సీటు జనసేనకే కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనను పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులుగా చూస్తారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక్కమాట అన్నారంటే.. అమాటకు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. నా మంచిచెడ్డ చూసుకునే నా దేవుడు ఆయనే..నేను, మా నియోజకవర్గ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదు.. షర్మిల ఎక్కడ పోటీ చేసినా అంతే.. యడ్ల తాతాజీ కీలక వ్యాఖ్యలు

ముమ్మిడివరం నియోజకవర్గంలో అన్ని కులాలు నన్ను వదిలించుకోవడానికి సిద్దంగా ఉన్నారని అయితే.. అన్ని సర్వేలు నాకే బలంగా ఉన్నాయని పితాని బాలకృష్ణ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు