పేరుకే జిల్లా ప్రభుత్వాసుపత్రి.. సౌకర్యాలు మాత్రం శూన్యం
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో ఓ ఇంటి కరెంటు బిల్లు ఏకంగా రూ. 43 వేలు వచ్చింది. అద్దె ఇంటి కరెంట్ బిల్లును చూసి బాధిత మహిళ లబోదిబోమంటోంది. దీనిపై అధికారులను అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతోంది.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నష్టపోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున చెక్కులు అందించారు. ఇలా డబ్బులు ఇస్తోంది నేనున్నానే భరోసా కల్పించడానికే కానీ ఎన్నికల కోసం కాదని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లాలో మైనర్ బాలిక నిశ్చితార్థం అడ్డుకున్నారు ఐసిడిఎస్ సిబ్బంది. 16 సంవత్సరాల మైనర్ బాలికకు ఆమె మేనమామతో వివాహం చేసేందుకు బాలిక తల్లిదండ్రులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ సిబ్బంది వారికి అవగాహన కల్పించి నిశ్చితార్థం అడ్డుకున్నారు.
మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పక్క ప్లాన్ తోనే స్నేహితుడిని కృష్ణ నది దగ్గరకు తీసుకుని వెళ్లి కత్తితో పొడిచి చంపాడు.
విశాఖ షిప్పింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు టిడిపి నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధీనంలో ఉన్న హార్బర్ కు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
మతిస్థిమితం లేని ఓ యువతిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు వైసిపి నేత కోటేష్. యువతిని అత్యాచారం చేసి ఆరు నెలల గర్భవతిని చేసిన సంఘటన అతి దారుణమన్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డిఓకి వినతిపత్రం అందజేశారు.
తమిళనాడు-ఏపీ రోడ్ల మధ్య ఉన్న తేడాను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేశారు టీడీపీ కన్నా లక్ష్మీనారాయణ. ఆంధ్రకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు అని మన ఆంధ్ర పరువు కేసిఆర్ తీశారని..అయితే, ఆయన చెప్పిందే అక్షరాలా నిజమని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు.
ఏపీలోని 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు ఉంటే.. ప్రభుత్వం వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు సిపిఐ రామకృష్ణ. జగన్ మాట్లాడలేని దద్దమ్మ కాబట్టే ఏపీకి అన్యాయం జరుగుతోందని విమర్శలు గుప్పించారు.