జగన్ శాశ్వతంగా జైల్లోనే.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్.! తమ ప్రభుత్వం రాగానే జగన్ శాశ్వతంగా జైల్లోనే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలనే కోర్టులో పిటిషన్లు వేస్తూ అధికార పార్టీ ఇలా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. By Jyoshna Sappogula 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP Nettem Raghuram: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం(TDP Nettem Raghuram) సీఎం జగన్(AP CM Jagan) ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబు(TDP President Chandrababu)పై వరుస కేసులు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలనే ఇలా కుట్రలు చేస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనం కోర్టులో వేస్తున్న పిటిషన్లేనని అన్నారు. ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీ ఓర్వలేక అక్రమ కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. Also read: దేశ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి.. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి: కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చంద్రబాబుకు సుప్రీంకోర్టు(Supreme court) సపోర్టు గా తీర్పు చెప్పిన వైసీపీ ప్రభుత్వం తన పత్రికల్లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. కేవలం ఓటమి భయంతోనే సీఎం జగన్ ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా సీఎం జగన్ తన దృష్టి రాజకీయ కక్ష సాధించడంపైన కాకుండా ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. లేదంటే టిడిపి ప్రభుత్వం రాగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లోనే ఉంటారని కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం. Also Read: ఏపీకి మరో ముప్పు..ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను #cm-jagan-govt #tdp #andhra-paradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి