AP News: చంద్రబాబుని జగన్ ఏమీ చేయలేరు..వైసీపీ పాలనపై మండిపడ్డ సీపీఎం నేత జగదీష్
రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రైతాంగ సమస్యలను నిస్మరించిన సీఎం జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రైతాంగ సమస్యలను నిస్మరించిన సీఎం జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు.
కదిరిలోని 35 వార్డు కుమ్మరివాళ్ళపల్లిలో టీడీపీ ఇన్చార్జి కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి బాబు గ్యారెంటీ భవిష్యత్‌కు గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు.
అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీ ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు పడక తుంగభద్రలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అందుకుగాను ముందుగానే ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు.
పెనుకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై ఈ రోజు బాంబు దాడి జరిగింది. గోరంట్ల మండలంలో భారీగా ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరారు. అయితే.. అది పేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం సీఎం జగన్ మెప్పు పొందేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనియం అని అన్నారు. తమ నేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్.
ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్ బీని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.
అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు.
పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్‌కు తల్లిదండ్రులకు దేహశుద్ది చేశారు. పిల్లలను లోదుస్తుల కలర్ గురించి ఆడుగుతూ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని టైబ్రేరియన్పై ఆరోపణ చేశారు. ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రేరియన్‌ను చితకబాదిన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.