Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం!
అనంతపురం జిల్లా బొందలదిన్నెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ప్రతాప్ రెడ్డి, ప్రమీల, వెంకటలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గంధారగుట్టపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.