Allu Ayaan: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. మెగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. తరువాత తనదైన స్టైల్.. స్పెషల్ యాక్టింగ్ స్కిల్స్ తో రైజింగ్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఓ బ్రాండ్ అయ్యాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బన్నీకి ఇద్దరు పిల్లలు అనే విషయం తెలిసిందే. అల్లు అర్హ ఇప్పటికే ఒక సినిమాలో నటించింది. శాకుంతలం సినిమాతో సమంత తో కలిసి సందడి చేసింది అర్హ. ఇక అల్లు అర్జున్ కొడుకు అయాన్ (Allu Ayaan)సినిమాల్లో ఎంట్రీ ఇవ్వలేదు కానీ.. చిచ్చర పిడుగు. తాను చేసే అల్లరి పనులు.. చిలిపి చేష్టలు.. అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. వాటిని అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. తరుచు అయాన్ చేసిన ముద్దు ముద్దు పనులకు సంబంధించి బన్నీ షేర్ చేసే వీడియోలు వైరల్ అయిపోతుంటాయి.
పూర్తిగా చదవండి..Allu Ayaan: పోలీసులకు చెబితే అయిపోతావ్.. బన్నీకి అల్లు అయాన్ వార్నింగ్!
అల్లు అయాన్ అల్లరి పనులను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇటీవల అయాన్ అల్లరి చేస్తుంటే..చేయి ఎత్తానని..దానికి “ అమెరికాలో పిల్లలను కొడితే..పోలీసులకు ఫోన్ చేస్తారని తెలుసా?’’ అంటూ అయాన్ బెదిరించాడని బన్నీ ఒక పోస్ట్ షేర్ చేశారు. అది ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
Translate this News: