Deepinder First Wife: జొమాటో వ్యవస్థాపకుడు-CEO దీపిందర్ గోయల్ తన మెక్సికన్ స్నేహితురాలు గ్రేసియా మునోజ్‌ను రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇది ఆయనకు రెండో పెళ్లి. ఈయన రెండో పెళ్లి చేసుకున్నారు అని వార్తలు వచ్చిన వెంటనే.. ఆయన మొదటి భార్య(Deepinder First Wife) పై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఆయన మొదటి భార్య పేరు కంచన్ జోషి. ఆమెను ప్రేమించి.. ఆమెతో ‘అవును’ అనిపించుకోవడం కోసం 6 నెలల పాటు ఆమె వెనుకే తిరిగారు దీపీందర్. ఆసక్తికరమైన ఈ కథ ఏమిటో తెలుసుకుందాం.
ఐఐటీ-ఢిల్లీలో చదువుతున్నప్పుడు దీపిందర్, కంచన్ లు కలిశారు. వీరిద్దరూ మ్యాథ్స్, కంప్యూటింగ్ విభాగాల్లో విద్యార్థులు. దీపిందర్ ఒకసారి ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంచన్ నుండి ‘అవును’ అని వినడానికి తాను 6 నెలల పాటు ఆమె వెంట పడాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ రోజుల్లో కాంచన్ ఎమ్.ఎస్.సి మ్యాథమెటిక్స్ చేస్తుండడంతో ల్యాబ్‌లో తరచుగా కలుసుకునేవారు. ఆ సమయంలో ఆమెను(Deepinder First Wife) ప్రేమించిన దీపీందర్ తన ప్రేమ విషయంలో ఆమెను ఒప్పించడానికి తీవ్రంగా శ్రమించానని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read: మెక్సికో మోడల్ తో జొమాటో సీఈవో సీక్రెట్ మ్యారేజ్.. హనీమూన్ తర్వాత ఎక్కడ ఉన్నారంటే..
2007లో వివాహం, 2008లో జొమాటో..
ఇప్పుడు అందరూ దీపిందర్‌ను జొమాటో పేరుతో చెప్పుకుంటారు. అయితే దాని ప్రారంభంలో కాంచన్ ప్రోత్సాహం.. కృషి కూడా ఉన్నాయి. దీపిందర్ – కాంచన్ 2007లో వివాహం చేసుకున్నారు. మరుసటి సంవత్సరం అంటే 2008లో, దీపిందర్ – పంకజ్ చద్దా జొమాటోను ప్రారంభించారు. అప్పుడు దానిని Foodibay అని పిలిచేవారు. కాంచన్ (Deepinder First Wife)తనను బాగా అర్ధం చేసుకుందని దీపిందర్ తరచూ చెప్పారు. తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చేవారు. వీరికి 2013లో సియారా అనే కుమార్తె పుట్టింది.
కంచం జోషి ఇప్పుడు ఎక్కడ?
జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాంచన్-దీపిందర్ ఇప్పుడు విడిపోయారు. కంచన్ జోషి(Deepinder First Wife) ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని ధృవీకరించడానికి ఎటువంటి వార్తలు లేవు. వారి మధ్య ఏమి జరిగింది? ఎందుకు విడిపోయారు అనే విషయమూ ఎవరికీ సరిగా తెలీదు. అయితే, ఇప్పుడు దీపిందర్ గోయల్ – గ్రేసియా మునోజ్ ను పెళ్లి చేసుకున్నారనే వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. గ్రేసియా భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె దీపిందర్ గోయల్‌ను కలిశారని చెబుతున్నారు. తరువాత వారిద్దరూ చాలా కాలం డేటింగ్ చేశారని రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఇద్దరూ హనీమూన్ నుంచి తిరిగి భారత్ వచ్చారని తెలుస్తోంది.