భారత వెటర్నర్ ఆటగాళ్ళు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ సురేశ్ రైనాల మీద పారా ఒలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రం వ్యక్తం చేసింది. అంత పెద్ద ఆటగాళ్ళ నుంచి ఇలాంటి ప్రవర్తనను అస్సలు ఊహించలేదని అంటున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని సూచించారు. వాళ్ళు చేసినదానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
అసలేం జరిగిందంటే..
ఇంగ్లాండ్‌లో వరల్డ్ చాంపయన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ జరిగింది. దీనిలో భారత వెటర్నర్స్ అందరూ ఒక జట్టుగా కలిసి మ్యాచ్‌లు ఆడారు. ఈ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా ఉన్నాు ఈ టీమ్‌లో హర్భజన్ సంగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనాలు ఉన్నారు. ఇది టీ20 టోర్నీ. ఇందులో ఫైనల్స్‌లో భారత్, పాకిస్తాన్ ఛాంపియన్స్ ఆడారు. ఈ మ్యాచ్‌లో యువీ టీమ్ గెలిచింది. మొదటిసారే వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఆనందాన్ని యువీ టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. ఇందులో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. 15 రోజులుగా వీళ్ళందరూ క్రికెట్ గ్యాప్ లేకుండా ఆడుతున్నారు. దీంతో ఆటగాళ్ళు చాలా అలిసిపోయారు. ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేశాయి. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు. ఇదే వాళ్ళ కొంప ముంచింది.
క్రికెటర్ల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. అది కాస్తా వైరల్ అయింది. దీన్ని చూసిన పారా ఒలిపింక్స్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి అంటూ ురకలు అంటించింది. ఇతరుల వైకల్యాన్ని ఎత్తి చూపేలా ప్రవర్తించడం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని పారా ఒలింపిక్ ఇండియా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి అంటూ డిమాండ్ చేసింది.
మరోవైపు ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. దీనికి స్పందనగా యువీ తన అకౌంట్లో పెట్టిన వీడియోను డిలీట్ చేశాడు. ఇక భజ్జీ తాము ఎవరినీ బాధపెట్టాలని అలా చేయలేదని…మా డాన్స్ వెనుక ఎలాంటి ఇన్టెన్షన్ లేదని తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. తాము తెలియకుడా ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని అన్నాడు.
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2024
Also Read:Terror Attack: భారత్‌లో కల్లోలానికి ఉగ్రవాదుల ప్లాన్