Shreyanka Patil : శ్రేయాంక పాటిల్.. ప్రస్తుతం ఈమే గురించి నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మధ్యే ముగిసిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో(WPL Final) ఈ క్రికెటర్ సంచలన ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. ఆర్సీబీ ఛాంపియన్(RCB Champion) గా నిలవడంలో శ్రేయాంకా కీలక పాత్ర పోషించింది. 3.3 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టింది. కప్పు కల నెరవేర్చిన ఈ 21 ఏళ్ల అమ్మాయిని అభిమానులు ఆర్సీబీ క్విన్(RCB Queen) గా పిలుస్తున్నారు. ఈ కర్నాటక(Karnataka) ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కి వీరాభిమాని. అప్పట్లో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో కోహ్లీని కలిసింది. తర్వాత క్రికెట్ పై మక్కువ పెంచుకుని స్టార్ ప్లేయర్ గా ఎదగడమే కాదు.. ఆర్సీబీ తరపున ఆడి ఆ జట్టు కప్ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది.
కాగా ఐపీఎల్ 2024 సీజన్ కోసం మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్ బాక్స్ ఈవెంట్ కు శ్రేయాంక పాటిల్(Shreyanka Patil) హాజరైంది. అక్కడ మరోసారి తన ఆరాధ్య క్రికెటర్ కోహ్లీని కలిసింది. కోహ్లీని కలవడం సంతోషంగా ఉందని సంబరపడిపోయింది. కోహ్లీ కారణంగా క్రికెట్ చూడటం మొదలుపెట్టాలనని..అతనిలా ఉండాలని కలలు కంటూ పెరిగానని..గత రాత్రి నా జీవితంలో మరిచిపోలేని క్షణం అనే క్యాప్షన్ జోడించి కోహ్లీతో దిగిన ఫొటోను షేర్ చేసింది. విరాట్ కు నిజంగా నా పేరు తెలుసు. నాతో మాట్లాడి బాగా బౌలింగ్ చేశావని అభినందించారు. అంటూ అదే పోస్టులో శ్రేయాంక రాసుకువచ్చారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి : ఐపీఎల్లో ఛీర్ లీడర్స్..ఒక్కో మ్యాచ్కు ఎంత సంపాదిస్తారో తెలుస్తే షాక్ అవుతారు.!