టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. అంతేకాదు మంగళవారం తమ నిశ్చితార్థం జరగగా ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ ‘నా జీవితంలో తర్వాతి చాప్టర్ మొదలైంది’ అంటూ అభిమానులతో పంచుకున్నాడు.
View this post on Instagram
Also read : కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి
ఈ క్రమంలోనే వెంకటేష్ అయ్యర్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్స్, టీమిండియా క్రికెటర్లతోపాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వివాహ వేడుక ఎప్పుడూ జరుగుతుందనే విషయాన్ని మాత్రం వెంకటేష్ అయ్యర్ కానీ, అతని కుటుంబసభ్యలు కానీ వెల్లడించలేదు. కాకపోతే త్వరలోనే వివాహం కూడా జరగనుందని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ ఏడాది ఐపీఎల్లో వెంకటేష్ అయ్యర్ రాణించాడు. ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 14 మ్యాచుల్లో 145 స్ట్రైక్ రేటుతో 404 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా వెంకటేష్ అయ్యర్ ను రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం నిర్వహించబోతున్నారు. టీమిండియా తరఫున రెండు వన్డేలు, తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు వెంకటేష్ అయ్యర్. ఈ అవకాశాల్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వన్డే, టీ20ల్లో విఫలం కావడంతో టీమిండియాకు దూరమయ్యాడు. చివరగా గత ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేష్ అయ్యర్. ఏది ఏమైనా అతను ఓ ఇంటివాడు కాబోతున్నందుకు అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.