Newly Married Woman Died: భాగస్వామితో ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనేందుకు.. కొందరు పురుషులు వయాగ్రా టాబ్లెట్ వేసుకుంటారు. అయితే తాజాగా ఓ వరుడు శోభనం రాత్రి చేసిన పని.. వధువుకు చివరి రాత్రి అయ్యింది. శోభనానికి ముందు వరుడు వయగ్రా తీసుకొని శృంగారంలో పాల్గొన్నాడు. అతడు చేసిన పనికి ఆ వధువు తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్తో గాయాలపాలైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. అవగాహన లేకుండా, నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా వ్యవహరించిన ఆ యువకుడు ఆమె మృతికి కారణమయ్యాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదశ్‌లో (Uttar Pradesh) చోటుచేసుకుంది.
Also Read: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. నేడే భూమి పూజ.. ఎక్కడంటే?
రాక్షసంగా ప్రవర్తించాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు (Hamirpur) చెందిన ఇంజినీర్‌కు ఫిబ్రవరి 3న వివాహం జరిగింది. వధువుకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఫిబ్రవరి 7న ఆసుత్రిలో చేర్పించారు. చివరికి ఫిబ్రవరి 10న ఆమె చనిపోయింది. శోభనం రోజున వయగ్రా టాబ్లెట్‌ను (Sex Enhancement Pills) వేసుకున్న వరుడు.. బాధితురాలిపై రాక్షసంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ప్రయివేటు భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె అస్వస్థకు గురైంది. ఆసుపత్రికి తరించినా ఫలితం లేకపోయింది.
కఠినంగా చర్యలు తీసుకోవాలి
సామూహిక అత్యాచారం చేసినట్లుగా.. బాధితురాలి పరిస్థితి దారుణంగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు లేని ఆ యువతికి.. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు పెళ్లి చేశాడు. ఫిబ్రవరి 4న ఆమెను అత్తగారింటికి పంపించాడు. చివరికి ఈ విషాదకర ఘటన జరిగింది. అయితే నిందితుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వయగ్రా వేసుకోని.. బలవంతంగా అసహజ శృంగారం చేశాడని ఆరోపించారు.
Also Read: మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ కూడా చర్చించాల్సిందే: రైతు సంఘాలు డిమాండ్
తల్లిదండ్రులతో కలిసి పరార్
వధువు సోదరుడు మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 7న నాకు ఫోన్ వచ్చింది. అతడు మా సోదరి ఏదో తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందని.. ఇంటికి తీసుకెళ్లిపోవాలని చెప్పాడు. ఆమె చికిత్స కోసం రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని.. ఆమె చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయలేనని అన్నాడు. ఆ తర్వాత నేను కాన్పూర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ 3 రోజులు చికిత్స చేసిన తర్వాత ఆమె మృతి చెందిందని’ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలాఉండగా.. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆ వరుడు.. తన తల్లిదండ్రులతో కలిసి పరారయ్యాడు.