Uttar Pradesh: మీరట్‌లో కూలిన మూడంతస్తుల భవనం..8మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్‌‌లోని 50 ఏళ్లనాటి మూడతస్తుల భవనం కూలిపోయింది. దీని కింద 8మందికి పైగా చిక్కుకుని మరణించారు. వారితో పాటూ మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి.

New Update
3 Storage Building Collapsed

3 Storage Building Collapsed: మీరట్‌లో 50 ఏళ్ళ నాటి భవనం కూలిపోయింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మూడంతస్తుల భవనం నానిపోయింది. ఇది చాలా పాతది కావడంతో కూలిపోయింది. అయితే ఇదంతా సడెన్‌గా జరగడంతో ఇందులో నివసిస్తున్న కుటుంబం ఇందులో చిక్కుకుపోయింది. మొత్తం కుటుంబం అంతా శిథిలాలకింద ఉండిపోయిందని తెలుస్తోంది. ఫ్యామిలీలో ఎనిమిది మంది ఉన్నారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. భనం కూలిన వెంటనే స్థానికులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో జేసీబీ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

చుట్టుప్కల వారు ఇచ్చిన సమాచారం ప్రకారం కూలిన ఇల్లు నఫో అనే 50 ఏళ్ల మహిళకు చెందినది. ఈమె ఇద్దరు కుమారులు సాజిద్, గోవిందలు తమ భార్యలు, పిల్లలతో కలిసి ఇంట్లో నివసిస్తున్నారు. వీరిది పాల వ్యాపారం. ఇంట్లోనే గేదెలను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఫ్యామిలీతో పాటూ గేదెలు కూడా శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఈ ప్రమాదం మీద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించారు. సహయక చర్యలను వేగంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల ఉన్నవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. దాంతో పాటూ గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు