పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి స్మశాన వాటిక వద్ద సుమారు 50 కోతులు విగత జీవులుగా పడిపోయి ఉన్నాయి. అయితే వీటిపై విష ప్రయోగం జరిగిందా..? లేదా వీటిని చంపి వేరే ప్రదేశం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి పడేశారా..? అన్న కోణంలో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కోతులను చంపడం చాలా విషాదకరమైన సంఘటనాని ప్రజలు అంటున్నారు. దుబ్బపల్లి సర్పంచ్ శ్రవణ్ జేసీబీ సహాయంతో కోతులను పూడ్చేశారు. పోలీసులు ఫారెస్టు సిబ్బంది వెటర్నరీ వైద్యులచే శవపంచనామా నిర్వహించారు. వనాలు అంతరించిపోవడంతో వానరాలు గ్రామాల్లో సంచరిస్తున్నాయని, మూగజీవాలను చంపి వేయడం చాలా హేయమైన చేర్య అని అన్నారు. ఏది ఏమైనా మూగజీవాలను చంపడం చాలా బాధాకరమని దోషులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విచక్షణారహితంగా వాటిని చంపేశారు
అయితే.. రాష్ట్రంలో ఇటీవల కోతుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తేనే ఉన్నాం. మొన్నటి వరకు కోతుల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునే నేపథ్యంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కోతుల బెడద ఎక్కువవుతోందని కొంతమంది విచక్షణారహితంగా వాటిని చంపేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవటంతో జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం..దేవుడికి ప్రతి రూపంగా భావించే వానరాలకు విషం పెట్టి దారుణంగా చంపేశారు. ఈ సంఘటనపై జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగయ్య, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మంగీలాల్, దేవదాసు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంటన వెటర్నరీ డాక్టర్లు కోతులకు పోస్టుమార్టం నిర్వహించారు.
ఎలా చంపారు..? అనే కోణంలో విచారణ
అయితే, ఇటీవల కోతులు గ్రామాల్లోకి విపరీతంగా వస్తున్నాయి. పథకం ప్రకారమే.. ఈ కోతులను చంపేశారని తెలిసింది. ఈ క్రమంలోనే కోతులకు విషమిచ్చి చంపేశారు. ఏది ఏమైనా మూగజీవాలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి తప్ప.. విషం పెట్టి చంపడం పట్ల మండి పడుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులే ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిందితులను త్వరలో పట్టుకుంటామని వారు వెల్లడించారు. ఈ కోతుల అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఘటనపై సుల్తానాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే .. కోతులను ఎవరు చంపారు..?, ఎలా చంపారు..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుగుతున్నారని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కీచకుడిగా మారిన టీచర్… బుద్ధి చెప్పిన పేరెంట్స్