Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడో సారి సీఎం అయ్యి హ్యటిక్ రికార్డును నమోదు చేస్తారని అన్నారు.
ALSO READ: మందు బాబులకు ALERT.. నేటి నుండి వైన్స్ బంద్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్. ‘ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు.. సిర్పూర్ నుంచి అలంపూర్ వరకు.. భద్రాచలం నుంచి జహీరాబాద్ వరకు.. తాండూర్ నుంచి చెన్నూర్ వరకు.. మధిర నుంచి ముథోల్ వరకు.. మక్తల్ నుంచి జుక్కల్ వరకు..తెలంగాణ అంతటా కారు జోరు! మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు!’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.
ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా…
సిర్పూర్ నుండి అలంపూర్ దాకా…
భద్రాచలం నుండి జహీరాబాద్ దాకా…
తాండూర్ నుండి చెన్నూర్ దాకా…
మధిర నుండి ముదోల్ దాకా…
మక్తల్ నుండి జుక్కల్ దాకా…
తెలంగాణ అంతటా కారు జోరు!
మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు!#KCRHattrick pic.twitter.com/tNisyEppU5— KTR (@KTRBRS) November 28, 2023