Leopard In Tirumala : తిరుమల(Tirumala) లో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ట్రాప్ కెమెరాల్లో చిరుత కనిపించిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నడకమార్గం పక్కనున్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. చిరుత(Leopard) తో పాటు ఎలుగుబంటి కదలికలు అధికారులు గుర్తించారు. ఎలిఫెంట్ ఆర్చ్ దగ్గర చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అవి తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్నీ టీటీడీ ఈవోకు సమాచారమందించారు ఫారెస్ట్ అధికారులు. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో నమోదైన కదలికలు. డిసెంబరు 13న, ఇవాళ ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కిందని ఫారెస్ట్ అధికారులు అన్నారు. నడకమార్గంలో భక్తులకు టిటిడి సూచనలు చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా రావాలి అని హెచ్చరికలు జారీ చేసింది.
ALSO READ: ఉచిత బస్సు ప్రయాణం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 8వ రోజుకు చేరుకుంది. ఎల్లుండి అర్దరాత్రితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. మరోవైపు తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న (శుక్రవారం) స్వామివారిని 56,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 4,52,183 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.