Constiation Tips: మలబద్ధకం సమస్య ఉన్న వారిలో కడుపు నొప్పిగా ఉండడం, గ్యాస్ ఫార్మ్ అయినట్లు అనిపిస్తుంది. దీనిని ముందుగానే గమనించి ట్రీట్ చేయకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లులో వారానికి మూడు సార్లు కంటే తక్కువగా మోషన్ వెళ్ళడం, మోషన్ వెళ్లేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారపు అలవాట్లు, నీళ్ళు తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం మలబద్ధకం సమస్యకు దారి తీస్తాయి. దీని వల్ల కడుపుబ్బరం, నోట్లో దురువాసన, కడుపు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మలబద్ధకం సమస్య తొలగించే చిట్కాలు
ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు.. పండ్లు, ఆకుకూరలు, కూరగాయాలు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.ఇవి జీర్ణకోశ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచును.
వ్యాయామం చేయాలి
ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మోషన్ ఫ్రీగా ఉండడానికి సహాయపడును. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
నీళ్ళు ఎక్కువగా తాగాలి
రోజూకు 8 గ్లాసుల నీళ్లను తాగాలి. నీళ్ళు ఎక్కువగా తాగితే మోషల్ లూస్ గా అవ్వడానికి ఉపయోగపడును. అంతే కాదు కెఫిన్ కంటెంట్ ఉన్న ఆహారాలు తక్కువగా తీసుకోవాలి. ఢీ హైడ్రేషన్ వల్ల మోషన్ ఇబ్బందిగా అవుతుంది. అంతే కాదు మోషన్ స్కిప్ చేయడం వల్ల కూడా మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉంటుంది.
Health benefits of Spices: మసాలాలు తింటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..! – Rtvlive.com