This Week OTT Releases : ఓటీటీ ప్రియులను అలరించేందుకు అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. ఆ చిత్రాలు, సీరీస్ ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆడు జీవితం
మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘ఆడు జీవితం (The Goat Life) మార్చ్ లో థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బహిష్కరణ
ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ థ్రిల్లింగ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంజలి వేశ్య పాత్ర పోషించింది. ఇప్పటికే ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ జులై 19వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
హరోం హర
సుధీర్ బాబును ఊరమస్ అవతార్ లో చూపించిన సినిమా హరోం హర. జూన్ 14న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ.. ‘ఈటీవీ విన్’ స్ట్రీమింగ్ అవుతోంది. తొలుత జులై 11న ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా, టెక్నికల్ సమస్యల కారణంగా తాజాగా స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు.
నెట్ఫ్లిక్స్
- త్రిభువన్ మిశ్రా సీఏ టాప్ర్ (హిందీ-సిరీస్) జులై 18
- స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ – (ఇంగ్లిష్) జులై 19
- ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లిష్) జులై 19
అమెజాన్ ప్రైమ్ వీడియో
- మై స్పై ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లిష్) – ఆల్రెడీ స్ట్రీమింగ్
ఆహా
- హాట్స్పాట్ (తెలుగు) – ఆల్రెడీ స్ట్రీమింగ్
జీ5
- బర్జాఖ్ (హిందీ సిరీస్) జులై 19
డిస్నీ+ హాట్స్టార్
- నాగేంద్రన్స్ హనీమూన్ – మలయాళ సిరీస్ జులై 19
ఈటీవీ విన్
- మ్యూజిక్ షాపు మూర్తి (తెలుగు)- ఆల్రెడీ స్ట్రీమింగ్
జియో సినిమా
- హరోం హర (హిందీ) జులై 18