High Tension At Hyderabad Secretariate : హైదరాబాద్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. డీఎస్సీ (DSC) వాయిదా కోరుతూ సోమవారం సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు డీఎస్సీ అభ్యర్థులకు పిలుపునిచ్చాయి. కానీ రూటు మార్చిన విద్యార్థి సంఘాల నేతలు, అభ్యర్థులు బీఆర్కే భవన్ (BRK Bhavan) వైపు వెళ్లారు. దీంతో అక్కడ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు బీఆర్కే భవన్లో కాళేశ్వరం (Kaleshwaram) పై ఐఏఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా అభ్యర్థులు దూసుకొచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
TGDSC
TG DSC: తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్స్ విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే!
TG DSC Hall Tickets: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు జరగనున్నాయి. డౌన్లోడ్ లింక్ ఇదే. https://tsdsc.aptonline.in/tsdsc/Hallticket
విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈ డీఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం. జనరల్ నాల్డెజ్, టీచింగ్‌తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్ వెయిటేజ్ ఉంటుంది.
ఇక ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 11,062 ఉద్యోగాల్లో.. 2,629 స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులున్నాయి. డీఎస్సీ పరీక్షల కోసం అభ్యర్థుల నుంచి ఈసారి 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది దరఖాస్తు చేసుకున్నారు.